Share News

యాక్సిస్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా శేష గిరిధర్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:00 AM

పొందూరు పోస్టాఫీసు వీధికి చెందిన కుప్పి లి శేషగిరిధర్‌ యాక్సి స్‌ బ్యాంక్‌ బోర్డు డైరె క్టర్‌గా నియమితులయ్యారు.

యాక్సిస్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా శేష గిరిధర్‌
కుప్పిలి శేషగిరిధర్‌

పొందూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పొందూరు పోస్టాఫీసు వీధికి చెందిన కుప్పి లి శేషగిరిధర్‌ యాక్సి స్‌ బ్యాంక్‌ బోర్డు డైరె క్టర్‌గా నియమితులయ్యారు. ఎల్‌ఐసీలో జాతీయస్థాయిలో అత్యున్నత పదవి ఈడీగా పనిచేస్తూ గతనెల 31న ఉద్యోగ విరమణ చేశారు. జాతీయస్థాయిలో ఎల్‌ఐసీ అందిం చిన సేవలు చూపిన ప్రతిభ కారణం గా యాక్సిస్‌ బ్యాంకు బోర్డు (ముంబై) లో నామినీ డైరెక్టర్‌గా బ్యాంకు యాజమాన్యం నియ మించింది. ఈయన ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ పాఠశా లల్లోనే చదివారు. గిరిధర్‌ తండ్రి కేఎల్‌వీ ప్రసాద్‌ విశ్రాంత ప్రధానో పాధ్యాయుడు. కుప్పిలి గిరిధర్‌ యాక్సిస్‌ బ్యాంకులో డైరెక్టర్‌గా నియమితులు కావడంపై స్నేహితులు, బంధువులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Sep 08 , 2026 | 12:00 AM