సేవలు అందుతాయని.. పనులు మానుకుని..
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:08 AM
ఈ ఫొటోలో ఉన్నది చిన్నలోగిడి రైతు సేవా కేంద్రం. సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం 11.30 గంటల సమ యంలో వచ్చిన కొంతమంది రైతులు కేంద్రం తెరవకపోవడంతో ఇలా కూర్చొని అధికారుల కోసం వేచి చూస్తున్నారు.
రైతులకు తప్పని నిరీక్షణ
పాతపట్నం రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఈ ఫొటోలో ఉన్నది చిన్నలోగిడి రైతు సేవా కేంద్రం. సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం 11.30 గంటల సమ యంలో వచ్చిన కొంతమంది రైతులు కేంద్రం తెరవకపోవడంతో ఇలా కూర్చొని అధికారుల కోసం వేచి చూస్తున్నారు. గత వైసీపీ పాలన కంటే ఉన్నతంగా సేవలందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే రైతులకు అనేక పథకాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తోంది. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదు. దీనిపై మండల వ్యవసాయాధికారి కె.సింహాచలంను వివరణ కోరగా.. ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా ప్రజల్లో ఉన్నామని చెప్పారు. ఈ కార్య క్రమం బుధవారంతో ముగిసిందన్నారు. మండలంలో రైతు సేవా కేంద్రాలన్నింటిని పరిశీలించి విధుల్లో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.