రోగులకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయి
ABN , Publish Date - May 13 , 2026 | 12:06 AM
నర్సింగ్ వ్యవస్థకు పునాది ఫ్లోరెన్స్ నైటెంగేల్ అని, ఆమెను ఆదర్శంగా తీసుకుని నర్సులు చేస్తున్న సేవలు వారికి గుర్తింపునిస్తాయని జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యు రాలు విజయ భారతి అన్నారు.
మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి
అరసవల్లి, మే 12(ఆంధ్ర జ్యోతి): నర్సింగ్ వ్యవస్థకు పునాది ఫ్లోరెన్స్ నైటెంగేల్ అని, ఆమెను ఆదర్శంగా తీసుకుని నర్సులు చేస్తున్న సేవలు వారికి గుర్తింపునిస్తాయని జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యు రాలు విజయ భారతి అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్స వాన్ని రిమ్స్ ఆసుపత్రిలో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్, నేషనల్ హ్యూమన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. రోగులపై నర్సు లు చూపే కరుణ, అంకితభావం వారిని సేవా మూర్తులుగా నిలబెడుతుందని కొనియాడారు. అంతకుముందు ఫ్లోరెన్స్ నైటెంగేల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో డీఎంహెచ్‌వో డా.కె.అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లుకలాపు ప్రసన్న కుమార్, రిమ్స్ కళాశాల ప్రిన్సి పాల్ అప్పలనాయుడు, నర్సింగ్ సూపరిం టెండెంట్ సంధ్యారాణి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, అసోసి యేషన్ కార్యదర్శి ఎల్. త్రినా థమ్మ, పి.సత్యవతి, వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
శిశుగృహ, బాలసదనం సందర్శన
పిల్లల సంరక్షణలో పూర్తి బాధ్యతతో వ్యవహ రించాలని మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి అన్నారు. మంగళవారం ఆమె అరసవల్లిలోని శిశుగృహ, బాలసదనాలను సంద ర్శించారు. అక్కడి బాలల యోగ క్షేమాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బాలల రక్షణాధికారి కేవీ రమణ, సంయుక్త తదితరులు పాల్గొన్నారు.