Share News

పొన్నాడ కేజీబీవీలో కలకలం

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:58 PM

పొన్నాడ కేజీబీవీలో మంగళవారం జరిగిన ఓ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పొన్నాడ కేజీబీవీలో కలకలం

టీలో ఈగల మందు కలిపిన మహిళ

అస్వస్థతకు గురైన పీఈటీ, వాచ్‌ఉమన్‌

ఎచ్చెర్ల/ఎచ్చెర్ల రూరల్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): పొన్నాడ కేజీబీవీలో మంగళవారం జరిగిన ఓ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళ పాలను, వంట సరుకులను మెస్‌ నుంచి ఇటీవల తీసుకువెళ్లింది. ఈ ఘటనను చూసిన పీఈటీ నర్సమ్మ, వాచ్‌ఉమన్‌ ఉష ఆమెను అడ్డు కున్నారు. దీంతో వారిపై కక్ష కట్టింది. వారికి ఇచ్చే టీలో ఈగల మందును కలిపింది. దీంతో వారిరువురూ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మిగిలిన సిబ్బంది వారిని సమీపంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించ గా చికిత్స పొందారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సదరు మహిళ సరుకులను తీసుకువెళుతుండగా అడ్డుకున్నామనే నెపంతో ఇలాం టి దుశ్చర్యకు పాల్పడిందని పీఈటీ, వాచ్‌ఉమన్‌ పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌ ఎం.సూర్యకళ వద్ద ప్రస్తావించగా పీఈటీలు, వాచ్‌ఉమన్‌ టీ తాగిన తర్వా త అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని, ఇద్దరూ చికిత్స తరువాత కోలుకున్నారని, ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియ జేశామన్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 15 , 2026 | 11:58 PM