Share News

ఆత్మహత్యల నివారణపై సదస్సులు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:16 AM

జిల్లాలో ఆత్మహత్యల నివా రణపై ప్రత్యేక అవగాహ న కార్యక్రమాలను నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. ఈ మేరకు జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు.

ఆత్మహత్యల నివారణపై సదస్సులు
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆత్మహత్యల నివా రణపై ప్రత్యేక అవగాహ న కార్యక్రమాలను నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. ఈ మేరకు జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో బాలల రక్షణ విభాగం, వన్‌స్టాప్‌ సిబ్బంది, కళాశాలలు, పాఠశాలలు, ఎస్‌హెచ్‌జీ లు, వివిధ శాఖల క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగా హన కలిగిస్తారన్నారు. మానసిక సమస్యలు ఎదు ర్కొంటున్న వ్యక్తులకు భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. కార్యక్రమం లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండ్యా, ఐసీడీఎస్‌ అధికారి ఎస్‌. సువర్ణ, జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌ ఉమ, బాలల రక్షణాధికారి రమణ పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్స్‌ను వినియోగించుకోండి

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఓపెన్‌ స్కూల్స్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌ చదివేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పీఠం వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 14 సంవత్సరాలు నిండిన వారు దూరవిద్యలో పదో తరగతి చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పది పూర్తయిన మహిళలు, పనులు చేసుకునే వారికి ఇంటర్‌లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డీఈవో రవిబాబు, దూరవిద్య కేంద్ర జిల్లా కో ఆర్డినేటర్‌ చంద్రభూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:17 AM