స్వీయగణనకు సహకారం అందించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:38 PM
జనగణనలో భాగంగా చేపడుతున్న స్వీయ గణనకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపుని చ్చారు.
- ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా చేపడుతున్న స్వీయ గణనకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపుని చ్చారు. మంగళవారం ఆమె తన నివాసంలో స్వీ య జనగణన చేపట్టారు. తన ఫోన్‌లో సొంతం గా వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వీయగణన వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కేవలం సెల్ నెంబరు ఇస్తే ఓటీపీ వస్తుందని, తద్వారా మొత్తం వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయని, ప్రశ్నావళి అనుసరించి అందులో సమాధానం ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ప్రజలకు ముందుగా సిబ్బంది అవగాహన కల్పించాలని, తరువాత వారే స్వయంగా స్వీయగణన చేసే వి ధంగా తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్ర మంలో ఆర్డీవో అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ వి.గిరిరాజు, ఏఎస్‌వో షేక్‌జాఫర్ పాల్గొన్నారు.
వీఏవోలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
పలాసరూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): సాంకే తిక నైపుణ్యాన్ని వీఏవోలు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం గ్రామ సం ఘాల సహాయకులకు విధి నిర్వహణలో ఉపయో గించేందుకు మొబైల్ ఫోన్లను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతిక నైపుణ్యంతో పనులను ఉద్యోగులు చేసేందుకు వీలుగా ప్రభు త్వం కల్పించిందని, ప్రతీ అంశాన్ని నేర్చుకొని పొ దుపు సంఘాల లావాదేవీలు, రికార్డుల నిర్వహణ విధులను నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పి.విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, మూడు మండలాల సమాఖ్య అధికారులు కె.జాంభవతి, కూర్మారావు, జి.వరప్రసాద్, వీఏవోలు పాల్గొన్నారు.