Share News

ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:57 PM

: పలాస మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విషయం లో టీడీపీ కూటమినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో అభ్యర్థుల జాబితాను రూపొందిం చారు.

ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
అభివాదం చేస్తున్న కూటమి నాయకులు

పలాస, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పలాస మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విషయం లో టీడీపీ కూటమినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో అభ్యర్థుల జాబితాను రూపొందిం చారు. శుక్రవారం రాత్రి జాబితాను ప్రకటించగా.. శనివారం తుది జాబితా విడుదలచేశారు. పలాస ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ పరిశీలకులు, కూటమి నాయకులు స్థానిక టీడీపీకార్యాలయంలో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. జనసేన, బీజేపీలకు కేటాయించిన స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు. కొన్ని స్థానాల కేటాయింపుపై టీడీపీ సీనియర్‌ నాయకులు అభ్యంతరా లు వ్యక్తం చేసినప్పటికీ.. కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కాళింగ సామా జికవర్గాని కి చెందిన వజ్జ గంగాభవానిని చైర్మన్‌ అభ్యర్థిగా ఎంపికచేయగా.. వైస్‌ చైర్మన్‌ పదవిని వైశ్య సామాజికవర్గానికి కేటాయించి నట్లు యార్లగడ్డ వెంకన్నచౌదరి ప్రకటించారు. సామాజిక సమీకరణాలను పరిగణన లోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం లో వజ్జ బాబూరావు, మల్లా శ్రీనివాస్‌, కృష్ణారావు, నరేంద్ర, జనసేన నాయకుడు దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:57 PM