జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:00 AM
జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లాకు చెందిన పలువురు క్రీడా కారులు ఎంపికయ్యారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లాకు చెందిన పలువురు క్రీడా కారులు ఎంపికయ్యారు. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 69వ ఎస్‌జీ ఎఫ్ అండర్-19 సాఫ్ట్‌బాల్ పోటీలు జరగనున్నాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలికి చెందిన డి.నవీన్ కుమారి, ఎల్.వాణి, జి.వెన్నెల, జె.కీర్తి, పి.లక్ష్మి ప్రియ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ఎస్.సుబ్బా రావు, డీఈవో ఎ.రవిబాబు, డిప్యూటీ డీఈవో ఆర్.విజయకుమారి, జిల్లా పీఈటీ, పీడీల సంఘం కార్యదర్శి ఎంవీరమణ, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బీవీరమణ, స్టేట్ పీఈటీ, పీడీల సంఘం కో ఆర్డినే టర్ ఎం.తిరుపతిరావు అభినందించారు.
ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్యం
ప్రతిభ కనబరిచిన దూబ హేమశ్రీ
ఎచ్చెర్ల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పంజాబ్ రాష్ట్ర చండీగఢ్‌లో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా అంతర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ కళాళాలకి చెందిన దూబ హేమశ్రీ ప్రతిభ కనబరిచి కాంస్యపతకం సాధించింది. 53 కిలోల విభాగంలో ఈమె ఈ పతకం పొందింది. శ్రీకాకుళం నగరంలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో చదువుతూ కోచ్ ఐ.అప్పన్న ఆధ్వ ర్యంలో శిక్షణ పొంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన హేమశ్రీని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య, స్పోర్ట్స్ డీన్ పి.రవి కుమార్, పీడీలు ఎం.శ్రీనివా సరావు, ఎ.భాస్కర్, తోటి విద్యార్థులు తదితరులు అభినందించారు.
ఇంటర్ వర్సిటీ పోటీలో కులశేఖర్ సెంచరీ
శ్రీకాకుళం స్పోర్ట్స్, జనవరి 27 (ఆంధ్ర జ్యోతి): మైసూరులో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌లో దుప్పల కులశేఖర్ సెంచరీ సాధించాడు. ఎచ్చెర్ల మండలం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశా లలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుల శేఖర్ జేఎన్‌టీయూ (జీవీ), విజయనగరం జట్టులో ప్రాతినిధ్యం వహిస్తు న్నాడు. తొలిమ్యాచ్‌లో కేఎస్ ఎన్‌యూపై జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేయగా, కులశేఖర్ 60 బంతుల్లో 126 పరుగులు చేసి నాటౌ ట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కులశేఖర్‌ను ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జీటీ చంద్రశేఖర్, అధ్యాపకులు అభినందించారు.
సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ పోటీలకు..
ఆమదాలవలస, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో మంగళవారం నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న జరుగుతున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ పోటీలకు తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జి.అశ్వినికుమార్ ఎంపికైనటు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ తరఫున అశ్విని కుమార్ పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ వ్యాయామ విభాగం ప్రొఫెసర్లు భాస్కర్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రికెట్ జట్టు పయన మైందన్నారు. ఈ జట్టుకు అశ్వినికుమార్ ప్రాతినిధ్యం వహించడంపై హర్షం వ్యక్తంచేస్తూ ప్రతిభ కనబరిచి విజేతగా నిలవా లని ఆకాంక్షించారు. విద్యార్థిని అభినందిం చిన వారిలో ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ పైడితల్లి, అధ్యాపకులు ఉన్నారు.