Share News

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:16 AM

పొన్నాడ నుంచి రాజాం వైపు అక్రమంగా తరలిస్తున్న 3,300 కిలోల రేషన్‌ (పీడీఎస్‌) బియ్యాన్ని చిలకపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నా రు.

 అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
పట్టుబడిన రేషన్‌ బియ్యంతో విజిలెన్స్‌ అధికారులు

ఎచ్చెర్ల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పొన్నాడ నుంచి రాజాం వైపు అక్రమంగా తరలిస్తున్న 3,300 కిలోల రేషన్‌ (పీడీఎస్‌) బియ్యాన్ని చిలకపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నా రు. వ్యాన్‌పై తరలి స్తున్న 72 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని అక్రమ తరలిస్తున్న పొన్నా డ గ్రామానికి చెంది న గుండ చినబాబు ను విచారించారు. పొన్నాడతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రేషన్‌ వినియోగదారుల నుంచి బియ్యాన్ని రూ.20 చొప్పున కొనుగోలు చేసి ఒడిశాలో సుంకి వద్ద వ్యాపారు లకు రూ. 30లకు అమ్ముతున్నట్టు వెల్లడించినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బియ్యం విలువ రూ.1,50,150 ఉంటుం దన్నారు. వ్యాన్‌ను సీజ్‌ చేశామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:16 AM