Share News

అల్లోపతి మందుల సీజ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:46 PM

మండలంలోని లొద్దపుట్టిలో అనుమతి లేకుం డా అక్రమంగా అల్లోపతి మందులు విక్రయిస్తున్న ఓ ఆర్‌ఎంపీపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.

అల్లోపతి మందుల సీజ్‌
మందులు పరిశీలిస్తున్న అధికారులు:

ఇచ్ఛాపురం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లొద్దపుట్టిలో అనుమతి లేకుం డా అక్రమంగా అల్లోపతి మందులు విక్రయిస్తున్న ఓ ఆర్‌ఎంపీపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈమేరకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించి సుమారు రూ.లక్ష విలువైన మందులు గుర్తించి సీజ్‌చేశారు. టెక్కలి ఔషధ తనిఖీ అధికారి ఎన్‌.యుగంధరరావు కథనం మేరకు.. లొద్దపుట్టికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఎ.అమిత్‌రాజ్‌రెడ్డిలైసెన్స్‌ లేకుండా తన ఇంట్లోనే అల్లోపతి మందులు నిల్వ ఉంచి రోగులకు విక్రయిస్తున్నాడు. ఈవిషయంపై పక్కా సమాచారం అందడంతో ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు ఎం.చంద్రరావు, టెక్కలి డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.యుగంధరరావు అమిత్‌ రాజ్‌ రెడ్డి ఇంట్లో తనిఖీచేశారు. రికార్డులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన అల్లోప తి మందుల స్టాక్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన సదరు ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేశారు. కాగా రోగుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేదిలేదని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఔషధ చట్లం- 1940 నిబందనలను అతిక్రమించి కనీస లైసెన్స్‌లు లేకుండా మందు లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 11:46 PM