విత్తన గుళికలు తయారు చేసుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:01 AM
రైతులు విత్తన గుళికలు తయారు చేసుకో వాలని సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు భవానీశంకర్ తెలిపారు.
కంచిలి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రైతులు విత్తన గుళికలు తయారు చేసుకో వాలని సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు భవానీశంకర్ తెలిపారు. శనివారం మండలంలోని అంపురం యూనిట్‌లో బలియాపుట్టుగ, అంపురంలో రైతులకు విత్తన గుళికల తయారీ విధానంపై ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ శివానందం విత్తన గుళికల ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంటీ కామరాజు, వీఏ వరలక్ష్మి, ఐసీఆర్‌పీ పుష్పలత, రేవతి పాల్గొన్నారు