Share News

అపార్‌తో విద్యార్థులకు భద్రత

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:54 PM

ఆటోమెటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌)తో విద్యార్థులు, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన ప్రయోజనాలు, గుర్తింపు సాధ్యమని కేంద్ర డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ప్రాంతీయ సమన్వయకర్త రవిపాండే తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూ నివర్సిటీలో గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తో కలిసి అపార్‌పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును నిర్వ హించారు.

 అపార్‌తో విద్యార్థులకు భద్రత
మాట్లాడుతున్న రవిపాండే :

ఎచ్చెర్ల, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఆటోమెటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌)తో విద్యార్థులు, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన ప్రయోజనాలు, గుర్తింపు సాధ్యమని కేంద్ర డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ప్రాంతీయ సమన్వయకర్త రవిపాండే తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూ నివర్సిటీలో గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తో కలిసి అపార్‌పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును నిర్వ హించారు. రిసోర్స్‌పర్సన్‌గా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థి వివరాలు నమోదుచేసుకుంటే ఆయనకు సంబంధించిన అకడమిక్‌ డేటా, సర్టిఫికె ట్లు, సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను డిజి లాకర్లలో పూర్తి భద్రత ఉంటుందన్నారు. కార్యక్రమంలో అపార్‌, సమర్ధ్‌ నోడల్‌ అధికారి పి.అనిల్‌కుమార్‌, వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌, కళాశాల ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎం.అనూరాధ, డాక్టర్‌ సీహెచ్‌ రాజశేఖరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:54 PM