Share News

కూటమి ధర్మాన్ని పాటించి సీట్ల కేటాయింపు

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:01 AM

: కూటమి ధర్మాన్ని పాటించి మునిసిపాలిటీలో జనసేనకు ఐదు, బీజేపీకి ఒక సీటు కేటాయించామని, ఆయా పార్టీల గుర్తులన్నీ మన గుర్తులుగా భావించి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.

 కూటమి ధర్మాన్ని పాటించి సీట్ల కేటాయింపు
టీడీపీలో చేరిన పదోవార్డుకు చెందిన నాయకులతో ఆమదాలవలస, పలాస ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, గౌతు శిరీష:

పలాస, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): కూటమి ధర్మాన్ని పాటించి మునిసిపాలిటీలో జనసేనకు ఐదు, బీజేపీకి ఒక సీటు కేటాయించామని, ఆయా పార్టీల గుర్తులన్నీ మన గుర్తులుగా భావించి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాసలో శిరీష విలేకరులతో మాట్లాడుతూ 90 శాతం హామీలన్నీ నెరవేర్చే తమకు ఓటు వేయాలని ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వార్డు రిజర్వేషన్ల మార్పిడిని అనేక మంది కోరారని, గతంలో జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వంలో పునరావృతం కానీయమన్నారు. వైసీపీ హయాంలో మందస ఎంపీపీ రిజర్వేషన్‌ ఒకరికి వస్తే వేరుగా మార్పిడి చేశారని, ప్రస్తుతం అంతా పారదర్శకంగా చేశామన్నారు. ఏ రిజర్వేషన్‌లో ఉన్నా అభ్యర్థులంతా గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీలో 11 కుటుంబాలు చేరిక

మునిసిపాలిటీలోని 10వ వార్డుకు చెందిన 11 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో ఆదివారం చేరాయి. కోఆప్షన్‌ మాజీ సభ్యుడు సన్యాసి అప్టో, కొర్రాయి సోమేశ్వరరావు, కుమారస్వామి, కుష్ణబెహరా, రవీంద్రప్రధాన్‌, కొర్రాయి అభి, దున్న ఢిల్లేష్‌, బి.శివ, వడ్డి గంగాధర్‌, పి.హర్షలకు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మునిసిపాలిటీలో టీడీపీ విజయం ఖాయమని చెప్పారు. అన్ని వార్డుల నుంచి వైసీపీ నాయకులు తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.

ఐక్యతతోనే విజయం సాధిస్తాం

ఐక్యతతోనే విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. ఈమేరకు ఆదివారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని వజ్జ గంగాభవానితో కలిసి టిక్కెట్‌ ఆశించి భంగపడిన నాయకులను ఒకేవేదికపైకి ఎమ్మెల్యే తీసుకువచ్చారు. ఈసందర్భంగా టిక్కెట్‌ ఆశించిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌ మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని, పార్టీ ఆదేశించిన విధంగా తాను నియోజకవర్గంలో అభ్యర్థుల విజయా నికి కృషి చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయంలో తాను ప్రధానపాత్ర పోషిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, గురిటి సూర్యనారాయణ, అంబటి కృష్ణమూర్తి, యవ్వారి మోహనరావు, ఎం.నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:01 AM