బి.కంచరాంలో పెనుగులాట
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:42 AM
మండ లంలో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్పృహ తప్పిన టీడీపీ మద్దతుదారు ఏజెంట్
పొందూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండ లంలో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. బి.కంచరాం పోలింగ్ కేంద్రంలో బూత్ నెంబరు మూడులో ఏజెంట్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారు ఏజెం ట్ పిసిని లక్ష్మణరావుకు పోలీసు సిబ్బంది మధ్య పెనుగులాట జరిగింది. కిందపడిపోయిన లక్ష్మణరా వు తల భూమికి బలంగా తగలడంతో స్పృహ కోల్పో యాడు. వెంటనే ఏఎస్పీ వివేకానందరెడ్డి స్పందించి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో అంతాశాంతించారు. అలాగే వీఆర్ గూడెంలో 100 ఏళ్లు దాటిన పైడాడ తవుడమ్మ తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. వీఆర్ గూడెంలో సీనియర్ నాయకులు సువ్వారి గాంధీని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.