కానిస్టేబుల్ పరీక్ష శిక్షణకు స్ర్కీనింగ్
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:10 AM
రలో జరగబోయే ఏపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉచిత శిక్షణ అందించేందుకు ఆది వారం జిల్లాలో స్ర్కీనింగ్ పరీక్ష నిర్వ హించారు.
‘ఎర్రన్న విద్యా సంకల్పం’లో పరీక్షకు 606 మంది హాజరు
అరసవల్లి/సోంపేట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే ఏపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉచిత శిక్షణ అందించేందుకు ఆది వారం జిల్లాలో స్ర్కీనింగ్ పరీక్ష నిర్వ హించారు. శ్రీకాకుళం నగరం, టెక్కలి, సోంపేటల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 606 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కన బరిచిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్‌తో పాటు, 120 రోజుల పాటు శిక్షణ ఇవ్వనన్నట్లు ఎర్రన్న విద్యా సంకల్పం నిర్వాహకులు తెలి పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభ్యర్థులను అభినందించారు. సోంపేట కార్య క్రమంలో ఎస్‌ఐ మోహిని, కేఆర్ కళాశాల కరస్పాండెంట్ శేషాద్రి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.