పాఠశాలలను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:06 AM
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఉపాధ్యాయులే కీలక పాత్ర షోషించాలని విశాఖ రీజియన్ ప్రాథమిక విద్య జా యింట్ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు.
ఆర్జేడీ విజయభాస్కర్
నరసన్నపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఉపాధ్యాయులే కీలక పాత్ర షోషించాలని విశాఖ రీజియన్ ప్రాథమిక విద్య జా యింట్ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో హెచ్‌ఎంలతో ఎన్‌రోల్‌మెంట్, ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో... ఇష్టంతో పని చేయాలన్నారు. ఉపాధ్యాయుడు పుస్తక పఠనం.. వ్యాయమం... యోగాకు ప్రాధాన్యమివ్వాలని ఆర్జేడీ చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండలాల్లోని పలు పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ పరిశీలించారు.