పాఠశాలలను పునర్నిర్మించాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:14 AM
Funds should be allocated for additional buildings ‘నరసన్నపేటలోని హడ్కోకాలనీ, వంశధార కాలనీల్లో శిథిలమైన పాఠశాలలను పునర్నిర్మించాలి. నియోజకవర్గంలో మరికొన్ని పాఠశాలలకు అదనపు భవనాల నిర్మాణానికి నిధులు వెచ్చించాల’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.
అదనపు భవనాలకు నిధులు కేటాయించాలి
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విజ్ఞప్తి
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి స్పందన
నరసన్నపేట, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘నరసన్నపేటలోని హడ్కోకాలనీ, వంశధార కాలనీల్లో శిథిలమైన పాఠశాలలను పునర్నిర్మించాలి. నియోజకవర్గంలో మరికొన్ని పాఠశాలలకు అదనపు భవనాల నిర్మాణానికి నిధులు వెచ్చించాల’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం అమరావతిలో మంత్రి లోకేశ్‌ను కలిసి.. నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. వంశధారకాలనీ పాఠశాల శిథిలం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ నెల 15న నరసన్నపేటలోని హడ్కోకాలనీ, వంశధార కాలనీల్లో సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాఠశాల భవనాలు శిథిలమైన విషయాన్ని ప్రస్తావించారు. వాటిని బాగుచేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల వంశధార కాలనీ పాఠశాలను పరిశీలించి.. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి మొదటి ప్రాధాన్యత క్రమంగా అదనపు భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం మంత్రి లోకేశ్‌కు కూడా కలిసి పాఠశాలలు పునర్నిర్మించాలని, అదనపు భవనాలకు నిధులు కేటాయించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేరమణమూర్తి తెలిపారు.