Share News

పోలీసులే వెళ్లిపొమ్మన్నారని...

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:11 AM

కొత్తూరు మండలంలో ఈ నెల 3న జరిగిన ఒక హత్యాయత్నం కేసులో నిందితుడు శొంఠ్యాన హరి విడుదల చేసిన సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది.

  పోలీసులే వెళ్లిపొమ్మన్నారని...

మెళియాపుట్టి (కొత్తూరు), జూలై 28 (ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలంలో ఈ నెల 3న జరిగిన ఒక హత్యాయత్నం కేసులో నిందితుడు శొంఠ్యాన హరి విడుదల చేసిన సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది. కొత్తూరు మండల కేంద్రానికి చెందిన వసిపినాయుడు, హరికి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులను దింపి... ఈ నెల 3న హత్య చేయడానికి హరి పథకం రచించాడు. ఆ రోజు రాత్రి వర్షం పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వసిపినాయుడు ఇంటికి బదులుగా పొరపాటున లోతుగడ్డ ధనుంజయ ఇంటిలోకి నిందితులు చొరబడ్డారు. నిద్రిస్తున్న ధనుంజయ కుమారుని హత్య చేయబోతుండగా ...కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేశారు. దీంతో అతని మెడలోని తులం బంగారం పట్టుకొని నిందితులు ఉడాయించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడైన హరి పరారీలో ఉన్నాడు. పోలీసులే తన వద్ద కొంత డబ్బు తీసుకొని పరారైపోమని చెప్పినట్టు హరి ఆ వీడియోలో తెలిపాడు. అయినప్పటికీ తన కుటుంబానికి ఇబ్బందులు పెడుతున్నారని పోలీసులపై ఆరోపణలు చేస్తూ... హరి విడుదల చేసిన వీడియో కొత్తూరు మండలంలో కలకలం రేపింది.

Updated Date - Jul 29 , 2026 | 12:11 AM