Share News

బయటకు వెళతానని చెప్పి..

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:08 AM

తల్లిదండ్రులు వలస కార్మికులుగా ఇతర ప్రాంతంలో ఉన్నారు.. నాయనమ్మ వద్ద ఉంటున్నాడు ఓ యువకుడు.

 బయటకు వెళతానని చెప్పి..
వికాస్‌ (ఫైల్‌)

  • నాయనమ్మ మృతితో మానసికంగా వేదనకు గురై..

  • రైలు ఢీకొని యువకుడి మృతి

కవిటి/ ఇచ్ఛాపురం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు వలస కార్మికులుగా ఇతర ప్రాంతంలో ఉన్నారు.. నాయనమ్మ వద్ద ఉంటున్నాడు ఓ యువకుడు. ఆమె 10 రోజుల కిందట మృతి చెందగా ఆమెతో ఉన్న సాన్నిహిత్యంతో మానసిక వేదనకు గురయ్యాడు. దాంతో పాటు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆ యువకుడు మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కు టుంబ సభ్యులు గాలించారు. లొద్దపుట్టి వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందినట్లు భావిస్తున్నారు. సదరు వ్యక్తి కవిటి మండలం జల్లుపుట్టుగ గ్రామానికి చెందిన పి.వికాస్‌ (23)గా గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సమా చారం అందించారు. ఈ మేరకు పలాస రైల్వే పోలీసు ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 06 , 2026 | 12:08 AM