Share News

శ్రీకాకుళాన్ని వరద కష్టాల నుంచి తొలగించండి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:47 PM

శ్రీకాకుళం నగ రానికి వరద ముప్పునుంచి శాశ్వతంగా తొలగించే చర్య లు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు.

శ్రీకాకుళాన్ని వరద కష్టాల నుంచి తొలగించండి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగ రానికి వరద ముప్పునుంచి శాశ్వతంగా తొలగించే చర్య లు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి సమస్య లను విన్నవించారు. సిక్కోలును ప్రధానంగా వేధిస్తున్న వరదలు, తీరం కోత సమస్యలను ఆయన దృష్టికి తీసు కెళ్లారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపేలా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వర దల వల్ల శ్రీకాకుళం నగరం తీవ్రంగా నష్టపోయిన తీరును రామ్మో హన్‌ నాయుడు హోంమంత్రికి వివరించారు. భవిష్యత్‌ లో ముంపు ముప్పు లేకుండా నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో ‘ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ వాల్స్‌’ (రక్షణ గోడలు) నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దగనగల్లవానిపేట (పీజీపేట) వ ద్ద నాగావళి నది, కళింగపట్నం వద్ద వంశధార నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ప్రవాహ దిశ నిత్యం మారుతోందని, దీనివల్ల తీరం కోతతో పాటు సదరు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీసీఆర్‌) సంస్థలు సంయుక్తంగా సిద్ధం చేసి న సమగ్ర ప్రాజెక్టు నివేదికలను అమిత్‌షాకు అందజే శారు. వాటి ఆధారంగా ఎన్డీఎంఏ నిధులు కేటాయించా లని కోరారు. ఈ ప్రతిపాదనలు, నిధుల మంజూరుపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

Updated Date - Mar 24 , 2026 | 11:47 PM