Share News

ఇంధనం ఆదా చేయాలి

ABN , Publish Date - May 18 , 2026 | 11:48 PM

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చేపట్టడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ హనుమంతు కూర్మారావు అన్నారు.

ఇంధనం ఆదా చేయాలి
సైకిల్‌పై నగరంలో పర్యటిస్తున్న కమిషనర్‌ కూర్మారావు

కార్పొరేషన్‌ కమిషనర్‌ కూర్మారావు

సైకిల్‌పై వెళుతూ నగరంలో అవగాహన

శ్రీకాకుళం అర్బన్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చేపట్టడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ హనుమంతు కూర్మారావు అన్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కలిగిం చేందుకు సోమవారం జిల్లా స్లైక్లింగ్‌ అసోసియేషన్‌ బృందంతో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రామలక్ష్మణ కూడలి నుంచి నగర వీధుల్లో కమిషనర్‌ తదితరులు సైకిల్‌పై వెళ్లి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజా ప్రతి నిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇంధన పొదుపు చర్యలు పాటిస్తు న్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలని కోరారు. సైకిల్‌ తొక్కడం వల్ల ఇంధనం ఆదాతో పాటు శారీరకంగా ఆరోగ్యం సిద్ధిస్తుం దన్నారు. అలాగే గుండెపదిలంగా ఉంటుందని, నరాల బలహీనత, అధిక బరువును నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమం లో జిల్లా స్లైక్లింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు నటుకుల మోహన్‌, లక్ష్మణరావు, లోక్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:48 PM