Share News

ప్రజల భద్రతకు ‘సావధాన్‌ ఇండియా’ యాప్‌

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:19 AM

ప్రజల రక్షణ, భద్రతతో పాటు అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందించేందుకు ‘సావధాన్‌ ఇండియా’ భద్రతా యాప్‌ దోహదం చేస్తుందని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నా యుడు, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

ప్రజల భద్రతకు ‘సావధాన్‌ ఇండియా’ యాప్‌
యాప్‌ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మంత్రులు రామ్మోహన్‌, అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణ, భద్రతతో పాటు అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందించేందుకు ‘సావధాన్‌ ఇండియా’ భద్రతా యాప్‌ దోహదం చేస్తుందని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నా యుడు, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం యాప్‌ బ్రోచర్‌ను శ్రీకాకుళంలో ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ యాప్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారన్నారు. సాంకేతిక పరిజ్ఞా నాన్ని ప్రజల భద్రతకు అనుసంధానించడం అభినందనీయ మన్నారు. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల తదితర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సమీపంలోని ప్రజలకు ఈ యాప్‌ ద్వారా తక్షణం సమాచారం చేరుతుందన్నారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:19 AM