ఎవరెస్టు బేస్ క్యాంపునకు సత్యవరం విద్యార్థిని ఎంపిక
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:54 PM
సత్యవరం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఒడ్డు ఇందుమతి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు దివ్యాంగుల విభాగంలో ఎంపికైనట్లు హెచ్‌ఎం ఓకులా రత్నమాల తెలిపారు.
నరసన్నపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సత్యవరం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఒడ్డు ఇందుమతి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు దివ్యాంగుల విభాగంలో ఎంపికైనట్లు హెచ్‌ఎం ఓకులా రత్నమాల తెలిపారు. ఈమేరకు మంగళవారం ఇందుమతికి హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులు కేశవరావు, లీలారాణి జ్యోతి, లక్ష్మణరావు అభినందించారు. గత నెల శ్రీకాకుళంలో జరిగిన దివ్యాంగుల పరుగు పందెంలో ఇందుమతి ప్రథమస్థానం నిలిచిందని చెప్పారు.దీంతో గురువారం నుంచి కడప జిల్లా గండికోటలో జరిగే శిక్షణకు హాజరుకానున్నట్లు తెలిపారు.