Share News

ఏపీ పీజీ సెట్‌లో సత్తా

ABN , Publish Date - May 29 , 2026 | 11:55 PM

Sreenija Sharma secures first rank at the state level ఏపీపీజీ సెట్‌(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజా శర్మ సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది.

ఏపీ పీజీ సెట్‌లో సత్తా
శ్రీనిజా శర్మ

శ్రీనిజా శర్మకు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంక్‌

ఇచ్ఛాపురం, మే 29(ఆంధ్రజ్యోతి): ఏపీపీజీ సెట్‌(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజా శర్మ సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శుక్రవారం సాయంత్రం ఈ ఫలితాలు విడుదల కాగా.. శ్రీనిజాశర్మ స్టేట్‌ ర్యాంక్‌ సాధించటంతో సర్వత్రా అభినందనలు తెలిపారు. శ్రీనిజా పదో తరగతిలో 10కి 10పాయింట్స్‌, ఇంటర్‌లో 86 శాతం, డిగ్రీలో 7.6శాతం ఉత్తీర్ణత సాధించింది. తాజాగా పీజీ సెట్‌ తెలుగు సబ్జెక్టులో 82మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌, హిస్టరీలో స్టేట్‌ 95 ర్యాంక్‌ దక్కించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనిజా తల్లి గృహిణి, తండ్రి తెన్నేటి తేజేశ్వరశర్మ జ్యోతిష్యం చెబుతూ.. పురోహితం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ కుమార్తెకు మంచి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందని తేజేశ్వరశర్మ తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 11:55 PM