Share News

నందిగాంలో సత్యసాయి పల్లకి ఉత్సవం

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:39 PM

నందిగాంలో సత్యసాయి శతజయంతిని పురస్కరించుకొని సోమవారం పల్లకి ఉత్సవం నిర్వహించారు. టెక్కలి, కోటబొమ్మాళి, పూండి తదితర సేవాసమితుల నేతృత్వంలో నందిగాం పురవీధుల్లో ఉత్సవం నిర్వ హించగా మహిళలు హారతులిచ్చారు. నందిగాం భజనమండలి సభ్యులు, ఆయా సేవా సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు.

 నందిగాంలో సత్యసాయి పల్లకి ఉత్సవం
నందిగాం: సత్యసాయి పల్లకి ఉత్సవం నిర్వహిస్తున్న సభ్యులు :

నందిగాం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): నందిగాంలో సత్యసాయి శతజయంతిని పురస్కరించుకొని సోమవారం పల్లకి ఉత్సవం నిర్వహించారు. టెక్కలి, కోటబొమ్మాళి, పూండి తదితర సేవాసమితుల నేతృత్వంలో నందిగాం పురవీధుల్లో ఉత్సవం నిర్వ హించగా మహిళలు హారతులిచ్చారు. నందిగాం భజనమండలి సభ్యులు, ఆయా సేవా సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫజలుమూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) మండలంలోని రామయ్యవలసలో సత్యసాయిబాబా పల్లకిసేవసాయి భక్తులు నిర్వహించారు. సత్యసాయి జయంతి వేడుకలు పురస్కరించుకొని సోమవారం సాయి పల్లకిసేవ ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్‌ అనాధగుప్త, పడాల ప్రసాద్‌, కొమనాపల్లి రమణ వివిఎస్‌ఎన్‌ మూర్తి నగిరికటకం, కొమనాపల్లి, అల్లాడ గ్రామాలకు చెందిన పలువురు సాయి భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:39 PM