Share News

9 నుంచి సత్యసాయి దీక్షలు

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:49 PM

సత్యసాయిబాబా వందో పుట్టిన రోజును పురస్కరించు కుని భక్తులు ఈనెల 8వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్షలు చేపట్టి 29న గురుపౌర్ణమి నాడు విరమిస్తారని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు.

9 నుంచి సత్యసాయి దీక్షలు
మాట్లాడుతున్న లక్ష్మణరావు

సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు

శ్రీకాకుళం కల్చరల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా వందో పుట్టిన రోజును పురస్కరించు కుని భక్తులు ఈనెల 8వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్షలు చేపట్టి 29న గురుపౌర్ణమి నాడు విరమిస్తారని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక బాపూజీ కళామందిరంలో ఆదివారం సేవా సంస్థల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆధ్యాత్మిక దీక్షల వల్ల శాంతియుత జీవనం పొందవచ్చన్నారు. తద్వా రా సమాజశాంతికి దోహదపడుతుందన్నారు. జిల్లా నుంచి 6,300 మంది భక్తులు 23వ పర్తి యాత్ర చేపట్టి సెప్టెంబరు 26, 27 తేదీల్లో పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకొని సామూహిక వ్రతాలు, భజనలు, వేదపఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారన్నారు. జిల్లాలో ఏడు గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని గిరిజన మహిళా ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నా మన్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా పౌష్టికాహారం అందజేస్తున్నామని, ఆకలితో అలమటించే వారికి ఇంటివద్దే ఆహారాన్ని సమకూరుస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు, సత్యసాయి సేవకులు పప్పల నాగేశ్వరరావు, బోయిన నర్సింహ మూర్తి తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:49 PM