సచివాలయానికి తాళం వేసి సర్పంచ్ నిరసన
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:58 PM
మం డలంలోని టీడీవలస సర్పంచ్ టంకాల జగన్మోహిని గురువారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. తమకు రావాల్సిన బిల్లులు పంచాయతీ కార్యదర్శి అప్‌లోడ్ చేయడంలేదని సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.
జి.సిగడాం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని టీడీవలస సర్పంచ్ టంకాల జగన్మోహిని గురువారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. తమకు రావాల్సిన బిల్లులు పంచాయతీ కార్యదర్శి అప్‌లోడ్ చేయడంలేదని సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సర్పంచ్ తాళం వేసిన విషయం సచివాలయ సిబ్బంది ఎంపీడీవో గుంటముక్కల రామకృష్ణా రావుకి తెలియజేశారు. దీంతో ఎంపీడీవో తమ సిబ్బందితో సచివాలయానికి చేరుకొని తాళం వేయడం సబబుకాదని, మీకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి కాని, ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమస్య పరి ష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పేర్కొనడంతో సచివాలయ తాళం తీశారు. సిబ్బంది యథావిధిగా విధులు నిర్వర్తించారు.