ఐఎస్‌వో సర్టిఫైడ్ పంచాయతీగా సంతబొమ్మాళి
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:34 AM
ఐఎస్‌వో 9001-2015 సర్టిఫైడ్ పంచాయతీగా సంతబొమ్మాళిని కేరళ బృందం ఎంపిక చేసింది.
క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేసిన కేరళ బృందం
సంతబొమ్మాళి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఐఎస్‌వో 9001-2015 సర్టిఫైడ్ పంచాయతీగా సంతబొమ్మాళిని కేరళ బృందం ఎంపిక చేసింది. గురువారం కేరళ రాష్ట్రానికి చెందిన పరిపాలన వ్యవహారాల సంస్థ అధికారులు సంతబొ మ్మాళి పంచాయతీలో పర్యటించారు. రాష్ట్రంలో 24 పంచాయతీల్లో ఐఎస్‌వో 9001-2015 సర్టిఫైడ్ ప్రొగ్రాం అమలవుతుండగా.. ఇందులో జిల్లా నుంచి సంతబొమ్మాళి పంచాయతీ ఒకటి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఐఎస్‌వో 9001-2015 సర్టిఫైడ్ పంచాయతీలుగా ఆరు ఉండగా.. సంతబొమ్మాళి ఏడో పంచాయతీగా గుర్తింపు పొందింది. కేరళ పరిపాలన వ్యవహారాల సంస్థ డైరెక్టర్ వీపీ సుకు మార్, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయ అధికారి ఇమాముద్దీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ పంచాయతీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఐఎస్‌వో సర్టిఫికేట్ జారీ చేశారు. కాగా పంచాయతీకి గుర్తింపు రావడంలో కృషి చేసిన కార్యదర్శి దుంప శ్రీనివాసరావును మండల అధికారులు అభినందిం చారు. కార్యక్రమంలో డివిజన్ డెవలప్‌మెంట్ అధికారి ఆలివేలు మంగమ్మ, ఎంపీడీవో ిపి.జయంత్ ప్రసాద్, తహసీల్దార్ బి.హేమసుందరావు, డిప్యూటీ ఎంపీడీవో డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.