‘పారిశుధ్య కార్మికులకు వేతనాలివ్వాలి’
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:51 PM
మార్చి నెల వేతనాలు అందక మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ అనుబంధ మునిసిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాయుడు, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మార్చి నెల వేతనాలు అందక మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ అనుబంధ మునిసిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాయుడు, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. హైకోర్టు తీర్పు మేర కు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ హనుమంతు కూర్మారావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన జిల్లా అధ్యక్షుడు కె.వేణుగోపాల్, సంఘ నాయకులు ఎన్.పార్థసారధి, జె.గురుమూర్తి, గణేష్, పెద్దమణి, రమణ, సీతమ్మ, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.