Share News

పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:38 PM

మహాశివ రాత్రి పురస్కరించుకుని శ్రీముఖలింగంలో చేపడుతున్న పారిశుధ్య పనులు పక్కాగా ఉండాలని జడ్పీ సీఈవో వి.సత్యనారాయణ, డీపీవో భారతీ సౌజన్య సూచించారు.

పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి
సిబ్బందికి సూచనలిస్తున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీపీవో భారతీ సౌజన్య

జలుమూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మహాశివ రాత్రి పురస్కరించుకుని శ్రీముఖలింగంలో చేపడుతున్న పారిశుధ్య పనులు పక్కాగా ఉండాలని జడ్పీ సీఈవో వి.సత్యనారాయణ, డీపీవో భారతీ సౌజన్య సూచించారు. ఈ మేరకు మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను గురువారం వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు గ్రామంలో అన్ని వీధులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాలువల్లోని చెత్తాచెదారాన్ని, మట్టిని తొలగించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. నాలుగు రోజులపాటు నిర్వ హించే ఈ ఉత్సవాలకు గ్రామాన్ని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచా లని, ఎప్పటికప్పుడు చెత్త ను తొలగించాలన్నారు. శ్రీముఖలింగం వచ్చే భక్తులకు ప్రతి వీధిలోను తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేసి నీటిసౌకర్యం కల్పించాలన్నారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో బి.చిన్నమ్మడు, డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:38 PM