డయేరియా కట్టడికి ‘పారిశుధ్య వ్యూహం’
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:55 PM
నగరంలో డయేరియా నివారణకు ‘పారిశుధ్య వ్యూహం’ సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇందులో భాగంగా అన్ని వార్డు సచివాలయా లకు 21 మంది జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ మిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
21 మంది ప్రత్యేకాధికారుల నియామకం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి: నగరంలో డయేరియా నివారణకు ‘పారిశుధ్య వ్యూహం’ సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇందులో భాగంగా అన్ని వార్డు సచివాలయా లకు 21 మంది జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ మిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకే తమకు కేటాయించిన వార్డుల్లో రిపోర్టు చేయాలని, క్షేత్ర స్థాయి లో పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల్లో ఎటు వంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పూడిక తీత, వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపట్టేందుకు పారిశుధ్య సిబ్బందితో పాటు ఒక ట్రాక్టర్, రెండు వార్డులకు ఎక్స్‌కవేటర్ అందుబాటులో ఉంచా లని, పారిశుధ్య పనులను నిరంతరం పరిశీలించి తగు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.
తాగునీటి కోసం రూ.60 కోట్లతో ప్రణాళిక: శంకర్
అరసవల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): నగరంలో స్వచ్ఛ మైన తాగునీటి వనరుల ఏర్పాటుకు రూ.60 కోట్లతో ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం నగరంలోని పలు వీధుల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి పర్యటించారు. స్థానిక రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిసరాలు, నెహ్రూ రోడ్, చౌక్ బజార్. పెట్రోమాక్స్ వీధి, చిన్నబజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి కాలువలను పరిశీలించారు. కాలువల్లో మట్టి పేరుకుపోవడాన్ని పరిశీలించి తక్షణం తొలగిం చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కాలువల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటా యించడం జరిగిందన్నారు. మంజూరైన రూ.60 కోట్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ కోసం రూ.24 కోట్లు కేటాయిస్తు న్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నగరంల 85 పనులు పూర్తి చేశామ న్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా నగరమంతా శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో డయేరియా అదుపులో ఉందన్నారు. కృష్ణాపార్కు పరిసరాలను పరిశీలించారు. ము రుగు కాలువల ఆధునికీకరణ, మంచినీటి పైపుల నిర్వహణ, కొత్త కాలువల నిర్మాణం, నిరంతర శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కాలువల్లో నీటి పైపులైన్లు లేకుండా చూడాలని, లీకేజీలను గుర్తించి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, కూటమి నాయకులు, వర్తకులు పాల్గొన్నారు.