పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 11:47 PM
w
నరసన్నపేట, మే 30(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. శనివారం నరసన్నపేటలోని ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాల నుంచి సంపదను సృష్టించే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి, రీసైక్లింగ్ చేసే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో స్వరూపరాణి, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, ఈవో ద్రాక్షాయణి పాల్గొన్నారు.