‘శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను విధుల్లోకి తీసుకోవాలి’
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:03 AM
నగర పాలక సంస్థలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.శరత్ కుమార్‌ను అకారణంగా తొలగిం చారని, తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు.
అరసవల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.శరత్ కుమార్‌ను అకారణంగా తొలగిం చారని, తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక మునిసి పల్ కార్యాలయం నుంచి జడ్పీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 16 సంవ త్సరాలుగా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అకారణంగా విధుల నుండి తొలగిం చారని, ఎమ్మెల్యే, మంత్రులు తక్షణమే పరిష్కా రం చూపాలన్నారు. కార్మికులపై పనిభారం తగ్గిం చాలని కోరారు. శరత్‌కుమార్ వెంటనే విధుల్లోకి లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రీవెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్‌కు వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కన్వీ నర్ ఆర్.ప్రకాశరావు, ఎ.గణేష్, సంతోష్, రాంబా బు, చిట్టిబాబు, యుగంధర్ పాల్గొన్నారు.