Share News

ఇసుక క్వారీ నిలిపివేయాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:35 PM

భగీరధపురం వద్ద వంశధారనదిలో నిర్వ హిస్తున్న ఇసుక క్వారీని నిలిపివేయాలని నీలాదేవిపురం, మహాలక్ష్మీపురం గ్రామ స్థులు మంగళవారం నిరసన తెలిపారు.

  ఇసుక క్వారీ నిలిపివేయాలి
నిరసన తెలుపుతున్న నీలాదేవిపురం, మహాలక్ష్మీపురం గ్రామస్థులు :

హిరమండలం, జూన్‌2(ఆంధ్రజ్యోతి): భగీరధపురం వద్ద వంశధారనదిలో నిర్వ హిస్తున్న ఇసుక క్వారీని నిలిపివేయాలని నీలాదేవిపురం, మహాలక్ష్మీపురం గ్రామ స్థులు మంగళవారం నిరసన తెలిపారు. రెండు గ్రామస్థులు క్వారీ వద్దకు చేరుకొని ఇసుకలోడ్‌తో వెళ్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈప్రాంతంలో ఇసుక క్వారీ నిర్వహణ వల్ల ఇబ్బందులు పడుతున్నా మని చెప్పారు. నది ఒడ్డున ఉన్న గ్రామాల సమీపం వరకు లోతుగా ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయంలో కోతకు గురయ్యే అవకాశముందని తెలిపారు.

Updated Date - Jun 02 , 2026 | 11:35 PM