అర్హులందరికీ పింఛన్ల మంజూరు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:23 AM
బడుగు, బల హీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు అని, ఆయన బాటలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పేదల సంక్షే మానికి పాటుపడుతున్నారని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
రణస్థలం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బడుగు, బల హీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు అని, ఆయన బాటలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పేదల సంక్షే మానికి పాటుపడుతున్నారని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. లావే రులో జ్యోతీబాపూలే బాలికల పాఠశాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలకు కొత్త భవనాలు మంజూరు చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంసం సృష్టించడమే తప్ప సరైన పాలన అందించ లేదని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇల్లు కూడా మంజూరు చేస్తామని, నియోజకవర్గానికి 10 వేల ఇళ్లు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తే గొడ్డలి పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడు తూ.. తోటపల్లి నీటిని పూర్తిస్థాయిలో అంది స్తామని చెప్పారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో దుర్భిక్షం ఏర్పడినందున కరువు మండలాలుగా ప్రకటించాలని టీడీపీ సీని యర్ నేత ముప్పిడి సురేష్ కోరారు. కార్య క్రమంలో కూటమి నేతలు లంక శ్యామలరావు, చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్, విశ్వక్సేన్, బెండు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు ( అచ్చెన్న)