డీసీసీ అధ్యక్షుడిగా సనపల బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:15 AM
డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సనపల అన్నా జీరావు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
అరసవల్లి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సనపల అన్నా జీరావు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నా రు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆయనను అభినం దించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భం గా కృపారాణికి పార్టీ నేతలు పుష్ప గుచ్ఛా లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పేడాడ పరమేశ్వరరావు, రెల్ల సురేష్, పూడి కిరణ్ కుమార్, అంబటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.