Share News

గడువుతీరిన ఆహార పదార్థాల విక్రయం

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:46 PM

నగరంలోని గుజ రాతీపేట మెయిన్‌రోడ్డులో ఉన్న సన్నా బేకరీపై మంగళవారం నగర పాలక సంస్థ అధికారులు దాడి చేశారు. గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి షాప్‌కి సీజ్‌ చేశారు.

గడువుతీరిన ఆహార పదార్థాల విక్రయం
నోటీసు అంటిస్తున్న అధికారులు

సన్నా బేకరీ సీజ్‌

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): నగరంలోని గుజ రాతీపేట మెయిన్‌రోడ్డులో ఉన్న సన్నా బేకరీపై మంగళవారం నగర పాలక సంస్థ అధికారులు దాడి చేశారు. గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి షాప్‌కి సీజ్‌ చేశారు. అలాగే బేకరీ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఫుడ్‌ కలర్స్‌ లభించడంతో పాటు విక్రయానికి ఉంచిన కొనిన స్వీట్లపై ఫంగస్‌ ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అందించిన నివేదిక మేరకు మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.సుధీర్‌ కుమార్‌ ఆదేశాలతో సన్నా బేకరీని తక్షణమే మూసివేసి ప్రాంగణానికి సీల్‌ వేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ మా ట్లాడుతూ.. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో ఫుడ్‌సేఫ్టీ, పారిశుధ్యం పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వ్యాపార సంస్థ చెల్లుబాటయ్యే ట్రేడ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని సూచించారు. )

Updated Date - Oct 06 , 2026 | 11:46 PM