జీతాలు సకాలంలో చెల్లించాలి
ABN , Publish Date - May 28 , 2026 | 11:24 PM
ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాన్ని విడనాడాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, జీతాలు సకాలంలో చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ మేనేజ్‌మెంట్ మాత్రమే నడపాలని శ్రీకాకుళం జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు.
అరసవల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాన్ని విడనాడాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, జీతాలు సకాలంలో చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ మేనేజ్‌మెంట్ మాత్రమే నడపాలని శ్రీకాకుళం జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ యూని యన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.