Share News

వేతనదారులు జాగ్రత్తలు తీసుకోండి:ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - May 08 , 2026 | 12:41 AM

వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి వేతనదారులు పని వేళలు పాటించాలని..జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

 వేతనదారులు జాగ్రత్తలు తీసుకోండి:ఎంపీ కలిశెట్టి
పనులను ప్రారంభిస్తున్న ఎంపీ కలిశెట్టి

ఎచ్చెర్ల, మే 7(ఆంధ్రజ్యోతి): వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి వేతనదారులు పని వేళలు పాటించాలని..జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జరజాం గ్రామంలోని బుగతవానిచెరువులో ఉపాధి పనులను ఆయన గురువారం పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎ.సురేష్‌ను ఎంపీ సత్కరించారు. కొత్తపేటలో ఇటీవల అనారోగ్యం పాలైన సీనియర్‌ టీడీపీ నాయకుడు అన్నెపు శ్రీమన్నారాయణను ఎంపీ కలిశెట్టి పరా మర్శించారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, పార్టీ నేతలు వావిలపల్లి రామకృష్ణ, పైడి ముఖలింగం, పొన్నాడ అప్పలనాయుడు, కొత్తకోట అమ్మినాయుడు, పప్పల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

లావేరు, మే 7(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహి స్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. గురువారం బుడతవలసలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం విన తులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ుండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తోటయ్యదొర, టీడీపీ నాయకులు లంక నారాయణరావు, కలిశెట్టి సూర్యనారాయణ, పిన్నింటి మధుబాబు, దోమాన రామకృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:41 AM