Share News

భక్తిశ్రద్ధలతో సహస్ర ఘటాభిషేకం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:07 AM

వర్షాలు కురవాలని కోరుకుంటూ పాతశ్రీకాకుళం కలెక్టర్‌ బంగ్లా వద్ద కొలువుదీరిన ఉమా రామలింగేశ్వర స్వామికి మంగళవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిం చారు.

భక్తిశ్రద్ధలతో సహస్ర ఘటాభిషేకం
జలాభిషేకానికి బారులు తీరిన భక్తులు

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వర్షాలు కురవాలని కోరుకుంటూ పాతశ్రీకాకుళం కలెక్టర్‌ బంగ్లా వద్ద కొలువుదీరిన ఉమా రామలింగేశ్వర స్వామికి మంగళవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిం చారు. భక్తులు కలశాలతో నీటిని తీసుకువచ్చి స్వామికి అభిషేకం చేశారు. కార్యక్రమాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎల్‌.రామలింగ స్వామి ప్రారంభించగా పెద్ద ఎత్తున మహిళలు శివలింగానికి జలాభి షేకం చేశారు. ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్తలు, శివ స్వాము లు, శివజ్యోతి భక్తభజన బృందం సభ్యులు పాల్గొన్నారు.

వరుణుడి కరుణ కోసం..

గార, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వరు ణుడి కరుణ కోసం శ్రీకూర్మంలో గ్రామ దేవత మోహిని భద్రాంబిక అమ్మవారికి మంగళవారం ఘటాభిషేకం నిర్వ హించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బం దులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. వందలాది మహిళ లు ఘటాలతో పవిత్ర జలాలను తీసుకు వచ్చి పసుపు, కుంకుమ కలిపి అమ్మ వారి శిరస్సు మునిగే వరకు అభిషేకం చేశారు.

Updated Date - Aug 12 , 2026 | 12:07 AM