కలగా రక్షిత జలం
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:28 PM
హిర మండలం మేజర్ పంచాయతీలో రక్షిత జలం కలగానే మిగిలింది.
- మురుగు కాలువల్లో తాగునీటి పైపులైన్లు
హిరమండలం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): హిర మండలం మేజర్ పంచాయతీలో రక్షిత జలం కలగానే మిగిలింది. పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్లు మురుగు కాలువల్లో మగ్గుతున్నాయి. ప్రధానంగా పాతబస్టాండ్ సమీపంలోని దిగువ వీధి, మెండవీఽధి, కైవాడ వీధుల్లో పైపులైన్లు మురుగు కాలువల్లో ఉన్నాయి. జల్‌జీవన్ మిషన్ కింద ఐదేళ్ల కిందట వీటిని ఏర్పాటు చేశారు. అయితే, కొద్దిరోజుల నుంచి ఈ పైపులైన్ కొళాయిల ద్వారా కలుషిత నీరు వస్తుం దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 300 కుటుంబాలకు పైగా ఈ నీటిని తాగేందుకు, వంటలకు ఉపయోగిస్తున్నాయి. పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఎదురుగా ఫైబర్ పైపులైను లీకేజి కారణం గానే కొళాయిల నుంచి వస్తున్న నీరు దుర్వాసన వస్తుందని మహిళలు చెబుతున్నారు. కైవాడ వీధిలో మురుగు కాలువలో పైపులైను జాయింట్లు ఉన్నాయి. ఈ జాయింట్ల వద్ద లీకులు ఏర్పడితే మురుగు వాటిల్లో చేరి కొళాయిల ద్వారా సరఫరా జరిగే ప్రమా దం ఉంది. అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్ట నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తక్ష ణమే పైపులైన్లను మార్చి సురక్షిత నీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.