ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:43 PM
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరివ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరివ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం పాతపట్నం దువ్వారవీధిలో జలజీవన్ మిషన్- అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కుళాయి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నియోజకవర్గంలో కొళాయిల ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చే సేందుకు రూ.150కోట్ల మంజూరుకావడంతో పనులు ప్రారంభించామని తెలిపారు.