Share News

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:43 PM

మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలను తప్పని సరిగా పాటించాలని, ఈ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండా లని డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీ ఆఫీసర్‌ ఎం.సూర్య తేజ సూచించారు.

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
మాట్లాడుతున్న డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీ ఆఫీసర్‌ సూర్యతేజ

డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీ ఆఫీసర్‌ సూర్యతేజ

ఇచ్ఛాపురం, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలను తప్పని సరిగా పాటించాలని, ఈ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండా లని డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీ ఆఫీసర్‌ ఎం.సూర్య తేజ సూచించారు. గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పీవోలు, ఏపీవోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులను భాద్యతాయుతంగా నిర్వర్తించాల న్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు తమకు అప్పగించిన విధులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. పోలింగ్‌ కు ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలింగ్‌ రోజు న అనుసరించాల్సిన విధానాలు, పోలింగ్‌ సమ యంలో ఎదురయ్యే సమస్య లను నిబంధనలకు అనుగుణంగా పరిష్క రించే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వ కుండా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిం చాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.రమేష్‌, 139 మంది పీవోలు, 132 మంది ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:43 PM