‘విద్యుత్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి’
ABN , Publish Date - May 20 , 2026 | 11:56 PM
విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ సిబ్బందితోనే నిర్వహిం చాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి వై.అప్పయ్య డిమాండ్ చేశారు.
అరసవల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ సిబ్బందితోనే నిర్వహిం చాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి వై.అప్పయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గేట్ మీటింగ్, ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. స్త్రీ శక్తి బస్సుల్లో జీరో టిక్కెట్ విధానాన్ని నిలుపుదల చేసి, మిగిలిన ప్రయాణికుల మాది రిగా టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుని సిబ్బం దిపై పనిభారం తగ్గించాలని కోరారు. సమస్య లను పరిష్కరించాల ని, ప్రయాణికులకు సరిప డా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీని నియమించాలని, ఐఆర్‌ను ప్రకటించా లని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎన్‌వీఆర్ మూర్తి, ఎంఎస్‌ఎన్ రాజు, ఎంఎస్‌పీ రావు, ఎంఎల్ రావు, ఎంఆర్ మూర్తి, శాంతమ్మ, ఎన్‌ఎస్ లక్ష్మి, పార్వతి పాల్గొన్నారు.