విద్యుత్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి
ABN , Publish Date - May 17 , 2026 | 12:07 AM
విద్యుత్ బస్సుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సమంజసం కాదని, ఆ బాధ్యతను ఆర్టీసీ సంస్థకే అప్పగించాలని ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు చింతాడ వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి పి.నానాజీ, జిల్లా అధ్యక్షుడు కె.దశరథ అన్నారు.
ప్రైవేటీకరణ పనులు చేపడితే ఉద్యమం
ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు
అరసవల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): విద్యుత్ బస్సుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సమంజసం కాదని, ఆ బాధ్యతను ఆర్టీసీ సంస్థకే అప్పగించాలని ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు చింతాడ వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి పి.నానాజీ, జిల్లా అధ్యక్షుడు కె.దశరథ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల కొనుగోలు నెపంతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరించేం దుకు కుట్ర చేయడం దుర్మార్గమని విమర్శిం చారు. ఇప్పటికే పలు కారణాలతో ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. విద్యుత్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వమే వాటిని నిర్వహించా లని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాపాడు కునేందుకు ఉద్యమం చేపడతామన్నారు. కార్య క్రమంలో సంఘం నేతలు డి.శేషుబాబు, కె. బాబూరావు, వసంతరావు, దుర్గారావు, వనజాక్షి, ఎంవీలక్ష్మి, పీవీ లలితకుమారి, ఎస్.ఉష, ఏవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.