ఆర్టీసీని పరిరక్షించాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:08 AM
ఆర్టీసీ సంస్థను పరిరక్షిం చాలని నేషనల్ మజ్డూర్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పయ్య కోరారు.
అరసవల్లి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సంస్థను పరిరక్షిం చాలని నేషనల్ మజ్డూర్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పయ్య కోరారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీశక్తి పథకం అమలు తరువాత ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా ఖాళీలను భర్తీ చేయ లేదని, తక్షణం తగు చర్యలు చేపట్టా లన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టడం సంతోషమేనని, అయితే వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 డిపోలను ఎత్తి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వానికి పూర్తి సహకారమందిస్తున్నా రని, అయితే మా భయాలను తెలియ జేసేందుకే రాష్ట్రంలోని 108 డిపోల్లో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో 2వ డిపో కార్యదర్శి నవీన్‌బాబు, 1వ డిపో కార్యదర్శి లక్ష్మణరావు, టీఆర్ కుమార్, రియాజ్, ఇజాజ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.