శ్రీకూర్మనాఽథుని సేవలో ఆర్టీసీ ఎండీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:03 AM
ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మం లోని కూర్మనాథ స్వామిని గురువారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు.
గార, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మం లోని కూర్మనాథ స్వామిని గురువారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండి తులు ఆశ్వీరచనం చేశారు. స్వామి వారి ఆలయ చరిత్ర, విశిష్టతను వివరించారు. స్వామివారి చిత్ర పటం, ప్రసాదాన్ని ఈవో టి.వాసుదేవరావు, ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామ నరసింహాచార్యులు ఆయనకు అందించారు.
డీపీవోలో స్వాగతం పలికిన ఎస్పీ
శ్రీకాకుళం క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ మేనే జింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గురువారం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ చేస్తున్న కృషిని ఆర్టీసీ ఎండీ ప్రశంసిస్తూ ఎస్పీని అభినందించారు.