పొలాల్లోకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:33 AM
కూర్మనాఽథపురం- మర్లపాడు మధ్య శుక్రవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దుసుకు వెళ్లింది.
ఫ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
వజ్రపుకొత్తూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కూర్మనాఽథపురం- మర్లపాడు మధ్య శుక్రవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దుసుకు వెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం టెక్కలి డిపోనకు చెందిన పూండి-పలాస బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బురదలో కూరుకుపోయి పొలాల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో బస్సులో విద్యార్ధులు , మహిళలు 70 మంది ఉన్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలపడంతో అంతా ఊపిరి పీల్చుకొని కిందకు దిగిపోయారు. కొంతసేపటి తరువాత ట్రాక్టర్‌కు తాడుకట్టి లాగడంతో పాటు విద్యార్థులు సహకారం అందించడంతో బస్సు రోడ్డు పైకి చేరింది. పూండి రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్పారు. రోడ్డు మరమ్మతుల పనులు నత్తనడకన చేపడుతుండడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి పూండి రోడ్డుకు మోక్షం కలిగించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.