Share News

1,112 గృహాలకు.. రూ.13.22కోట్లు

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:33 AM

New houses opened in the srikakulam జిల్లాలో 1112 గృహాలకు రూ.13.32 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శ్రీకాకుళంలోని 44వ డివిజన్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌, లబ్ధిదారుడితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు.

1,112 గృహాలకు.. రూ.13.22కోట్లు
నూతన గృహాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

జిల్లాలో నూతన ఇళ్లు ప్రారంభం

శ్రీకాకుళం మార్చి 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1112 గృహాలకు రూ.13.32 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శ్రీకాకుళంలోని 44వ డివిజన్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌, లబ్ధిదారుడితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గాల వారీ.. ఆమదాలవలసలో 106, నరసన్నపేటలో 55, ఇచ్ఛాపురంలో 151, ఎచ్చెర్లలో 112, పలాసలో 163, పాతపట్నంలో 201, శ్రీకాకుళంలో 324 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ సొంతింటి కల నెరవేరడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాజకీయాలకు అతీతంగా గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్‌ పీఎంజె.బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ రమాకాంత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కూర్మారావు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి. జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేరింది

ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరింది. ఓ థియేటర్‌లో పనిచేస్తూ.. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. మాకు ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహం చేశాం. సొంతంగా చిన్న ఇల్లు ఉంటేచాలు అనుకున్నాం. ప్రభుత్వం సహాయంతో ఇంటిని నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం పీఎంఏవై కింద గృహం మంజూరు చేసి.. రూ.2.50 లక్షలు ఆర్థిక సహాయం అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌కు కృతజ్ఞతలు.

- రామసింగి జగదీష్‌, సత్యానరగ్‌ కాలనీ, 44వ వార్డు, శ్రీకాకుళం

Updated Date - Mar 31 , 2026 | 12:33 AM