పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద రూ.4 లక్షలు సీజ్
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:10 AM
మునిసిపల్ ఎన్నికల నేప థ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపడుతు న్నారు.
ఇచ్ఛాపురం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నేప థ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపడుతు న్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం పురుషోత్తపురం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు ఒడిశా నుంచి ఆంధ్రాలోకి వస్తున్న ప్రతీ వాహనాన్ని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భువనేశ్వర్ నుంచి పలాస వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా కారులో రూ.4 లక్షలు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి కారులో ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా జీడిపిక్కల వ్యాపారం నిమిత్తం పలాస వెళ్తున్నామని తెలిపారన్నారు. అయితే నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న రూ.4 లక్షల నగదును ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రమేష్కు పోలీసులు అప్పగించారు. సీజ్ చేసిన నగదును ట్రెజరీలో భద్రపరిచామని, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా నగదు అక్రమ తరలింపును అరికట్టేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.